ప్రభాస్-హను రాఘవపూడి సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా?

by సూర్య | Thu, Jul 25, 2024, 08:21 PM

సీతా రామ ఫేమ్ హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఫౌజీ అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగష్టు 22, 2024న ప్రకటించబడుతుంది అని మరియు అదే రోజున సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని లేటెస్ట్ టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సెట్స్‌లో కొంత భాగం షూట్ జరగనుండడంతో ప్రత్యేక సెట్‌ను చిత్ర బృందం నిర్మించనుంది. సీతా రామం చిత్రానికి హిట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి  సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
'రెట్రో' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు Fri, Apr 18, 2025, 06:20 PM
జర్మన్ మహిళతో డేటింగ్ లో ఉన్న మలయాళం నటుడు Fri, Apr 18, 2025, 06:16 PM
'షష్ఠి పూర్తి' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Fri, Apr 18, 2025, 06:00 PM
బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని కన్ఫర్మ్ చేసిన గోపీచంద్ మాలినెని Fri, Apr 18, 2025, 05:56 PM
మ్యూజిక్ డైరెక్టర్ రాధాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'ఓ భామా అయ్యో రామా' టీమ్ Fri, Apr 18, 2025, 05:47 PM