'గేమ్ ఛేంజర్' ఇంట్రడక్షన్ సాంగ్ గురించి గీత రచయిత క్రేజీ అప్‌డేట్

by సూర్య | Thu, Jul 25, 2024, 05:10 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఈ సినిమా యొక్క ఇంట్రో సాంగ్ కి సంబంధించిన కొన్ని క్రేజీ న్యూస్‌ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరగండి తర్వాత సినిమాలో అత్యంత ఖర్చుతో కూడుకున్నది ఇంట్రో సాంగ్‌. ఇది అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది మరియు భారీ స్థాయిలో చిత్రీకరించబడింది. రామ్ చరణ్ గారు తన దర్శకుడిని పూర్తిగా నమ్మే వ్యక్తి. శంకర్‌గారికి రామ్‌చరణ్‌గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని చెప్పారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM