'మెకానిక్ రాకీ' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ లేబుల్

by సూర్య | Thu, Jul 25, 2024, 03:16 PM

రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామా 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ సౌత్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైనమిక్ జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31, 2024న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM