35M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'బహిష్కరణ'

by సూర్య | Wed, Jul 24, 2024, 05:11 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం జీ5 ప్రకటించిన 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌ లో తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్ కి ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జీ5లో జులై 19న ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 3 రోజులలో 35 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, మరియు చైతన్య సాగిరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ని పిక్సెల్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM