'డార్లింగ్' ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

by సూర్య | Thu, Jul 11, 2024, 03:50 PM

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ ని వెల్లడించారు. చిత్ర బృందం జులై 12న విజయవాడ మరియు గుంటూరులో సినిమా ప్రమోట్ చేసిన తర్వాత జులై 13న వైజాగ్ కి చేరనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM