'రాయన్' రన్ టైమ్ లాక్

by సూర్య | Mon, Jul 08, 2024, 04:55 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం నటుడి యొక్క పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్,ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM