శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'కుబేర'

by సూర్య | Tue, Jun 25, 2024, 03:42 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా షెడ్యూల్ ని ముంబైలో ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో నాగార్జున మరియు ధనుష్ పాల్గొనున్నారు. ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం. ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM