కమిటీ కుర్రోళ్లు : 'ప్రేమ గారడీ' సాంగ్ ప్రోమో అవుట్

by సూర్య | Tue, Jun 25, 2024, 03:09 PM

నిహారిక కొణిదెల తన తొలి చలన చిత్రానికి 'కమిటీ కుర్రోళ్లు' అనే టైటిల్‌ ని లాక్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క థర్డ్ సింగల్ ని ప్రేమ గారడీ అనే టైటిల్ తో జూన్ 26న సాయంత్రం 6:48 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు అర్మాన్ మాలిక్ తన గాత్రాన్ని అందించిన ఈ సాంగ్ యొక్క ప్రోమోని విడుదల చేసారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంతో యధు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM