నార్త్ అమెరికాలో 'కల్కి 2898AD' సెన్సేషన్

by సూర్య | Mon, Jun 24, 2024, 04:37 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమాకి నార్త్ అమెరికాలో 113K టికెట్స్ అమ్ముడయినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM