by సూర్య | Thu, Jun 20, 2024, 05:24 PM
రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నింద' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 21, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతు ఓంకార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News