'RC16' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే...!

by సూర్య | Wed, Jun 19, 2024, 04:47 PM

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 2024లో ప్రారంభం కానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్  కోసం భారీ విలేజ్ సెట్‌ను వేయనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సెట్ భారీగా ఉంటుంది మరియు 60% చిత్రం ఈ సెట్ లో జరుగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM