2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' షో రీల్

by సూర్య | Wed, Jun 19, 2024, 03:31 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా షో రీల్ ని విడుదల చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షో రీల్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM