ఆగస్ట్ 29న‌ రానున్న ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్

by సూర్య | Mon, Jun 17, 2024, 01:29 PM

ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో హాలీవుడ్ సిరీస్ రెడీ అయింది. 2022 సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్‌కు కొన‌సాగింపుగా రూపొందిన‌ రెండో సీజ‌న్ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో తాజాగా  ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటోంది. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు మంత్రాలు, మాయ‌లు, కుట్ర‌లు, యుద్దాల నేప‌థ్యంలోనే ఈ సిరీస్ సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతిని అందిస్తుంది.ఈ సీరీస్‌లో వ‌చ్చిన‌ మొదటి సీజన్ ప్రైమ్ వీడియోలో స్టీమింగ్ అవ‌గా ఎవ‌రూ ఊహించని విధంగా కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతటా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. అయితే ఇప్పుడు రానున్న రెండో సీజ‌న్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 29న‌ 240లకు పైగా దేశాలలో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో అందుబాటులో ఉండ‌నుంది.

Latest News
 
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM