అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'లాక్‌డౌన్' ఫస్ట్ సింగల్

by సూర్య | Sat, Jun 15, 2024, 03:48 PM

AR జీవా దర్శకత్వంలో బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లాక్‌డౌన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఎమోషనల్ డ్రామాగా రానున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ సింగల్ ని లావా లావా అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ పాటకి స్నేహన్ సాహిత్యం అందించగా, ప్రియా జెర్సన్ గానం అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది. ఎన్ఆర్ రఘునాథన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM