భారీ బడ్జెట్ తో మహారాగ్ని

by సూర్య | Tue, May 28, 2024, 08:21 PM

ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి  దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటి కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా  27 సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌లిసి న‌టిస్తుండ‌డం విశేషం. వీరితో పాటు నసీరుద్దీన్ షా , సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి అగ్ర న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం టీజర్ విడులైంది.టీజర్ మొదటి షార్ట్ నుంచి చివరి షాట్ వరకు అత్యంత ఉత్కంఠంగా రంజింపజేసింది. ఈ టీజర్ లో ముఖ్యంగా ప్రధాన క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇక చివరిగా డైనమిక్ లేడీ, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఎంట్రీనే అద్భుతంగా చూయించారు. జాతరలో ఫైట్ చేసే సీన్, తాను చెప్పే డైలాగ్ గూజ్ బమ్స్ తెప్పిస్తున్నాయి. మహా రాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీజర్ అశేష ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ముఖ్యంగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ చిత్రానికి పనిచేసిన జీకే విష్ణు ఈ మహారాగ్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. యానిమ‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందించ‌గా టీజర్ చూస్తేనే ఎంత ఇంఫాక్ట్ ఇవ్వ‌నుందో ఇట్టే అర్థమవుతుంది. టీజర్ కట్ చేసిన విధానం కూడా కబావుంది. ఈ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి పనితనం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

Latest News
 
'సారంగపాణి జాతకం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Wed, Apr 23, 2025, 08:06 PM
ప్రముఖ షోలో నాని యొక్క 'హిట్ 3' ప్రమోషన్స్ Wed, Apr 23, 2025, 08:02 PM
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం టి-సిరీస్ Wed, Apr 23, 2025, 07:55 PM
'సారంగపాణి జాతకం' గురించి ప్రియదర్శి ఏమన్నారంటే...! Wed, Apr 23, 2025, 07:50 PM
సూర్య - వెంకీ అట్లూరి చిత్రంలో కీర్తి సురేష్ Wed, Apr 23, 2025, 07:44 PM