త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న 'శశివదనే'

by సూర్య | Fri, May 24, 2024, 06:34 PM

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి నటించిన 'శశివదనే' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లో రక్షిత్ అట్లూరికి జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుంది. ఈ సినిమాలో ప్రవీణ్ యెండమూరి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రలు పోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ SVS కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి.లిమిటెడ్ మరియు AG ఫిల్మ్ కంపెనీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మరియు అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM