నేడు విడుదల కానున్న 'రాయన్' సెకండ్ సింగల్

by సూర్య | Fri, May 24, 2024, 03:48 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని పీచు మిఠాయ్యి అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం జూన్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM