'పుష్ప 2' రెండవ సింగిల్‌పై తాజా అప్‌డేట్

by సూర్య | Fri, May 10, 2024, 03:41 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని పుష్ప-పుష్ప అనే ఫస్ట్ సింగిల్ కొద్ది రోజుల క్రితం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.


తాజాగా ఇప్పుడు, రెండవ సింగిల్‌ని మూవీ మేకర్స్ త్వరలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం, రెండవ సింగిల్ అల్లు అర్జున్ మరియు రష్మిక నటించిన రొమాంటిక్ సాంగ్ అని లేటెస్ట్ టాక్. మూవీ మేకర్స్ ఈ సాంగ్ ని రెడీ చేసి గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM