'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' లో అతిధి పాత్రలో తమిళ స్టార్ హీరో?

by సూర్య | Thu, May 09, 2024, 06:29 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు.  ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు, ప్రముఖ తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ సినిమాలో కీలకమైన అతిధి పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షెడ్యూల్‌లో శివకార్తికేయన్ తన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. అయితే శివకార్తికేయన్ అతిధి పాత్రపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.


ఈ సినిమా సెప్టెంబర్ 5,2024న గ్రాండ్ విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీగౌతమ్ Mon, May 20, 2024, 04:56 PM
నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ Mon, May 20, 2024, 04:54 PM
బేబీ బంప్ తో దీపికా పదుకొనే Mon, May 20, 2024, 04:20 PM
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM