సాయి పల్లవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'తాండల్' టీమ్

by సూర్య | Thu, May 09, 2024, 03:48 PM

కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా హీరోయిన్ సాయి పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM