ఇలియానా ఆసక్తికర కామెంట్స్

by సూర్య | Thu, May 09, 2024, 03:35 PM

టాలీవుడ్‌లో గుర్తుండిపోయే హీరోయిన్లలో ఒకరైన ఇలియానా.. ప్రస్తుతం అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ షూరూ చేసింది.అయితే గతంలో పెళ్లి చేసుకోకుండానే తల్లయిన ఇలియానాపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలానే కుటుంంబం, భర్తపై కూడా పలువురు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తన పెళ్లి గురించి స్పందించింది.తన భర్త ఫీనిక్స్‌ డోలన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మైఖేల్‌తో తన జీవితం అద్భుతంగా సాగుతోందని తెలిపింది. నేను డిప్రెషన్‌లో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచాడని కొనియాడింది. సంతోషంగా ఉ‍న్నా.. బాధలో ఉన్నా ఎప్పటికీ నాకు సపోర్ట్‌గానే ఉన్నాడని పేర్కొంది. అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లే వర్ణించలేనంటూ ఎమోషనల్ అయింది. గతంలో నా భర్త, కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేనని ఇలియానా చెప్పిన సంగతి తెలిసిందే.


 


కాగా.. 2018లో చివరగా తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో కనిపించిన ఇలియానా.. ఆ తర్వాత హిందీకే పరిమితమైంది. రీసెంట్‌గా మార్చి 8న ఈమె నటించిన 'తేరే క్యా హోగా లవ్ లీ' చిత్రం రిలీజైంది. ఇది కాకుండా ఈ బ్యూటీ చేతిలో ఇంకో హిందీ మూవీ ఉంది.

Latest News
 
'ఆ ఒక్కటి అడక్కు' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Mon, May 20, 2024, 01:41 PM
'మిరాయి' నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ అవుట్ Mon, May 20, 2024, 01:39 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు 2' Mon, May 20, 2024, 01:37 PM
'ఇండియన్ 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, May 20, 2024, 01:35 PM
'కల్కి 2898AD' నుండి భైరవ బుజ్జి వీడియో అవుట్ Mon, May 20, 2024, 01:29 PM