తొలి టెలికాస్ట్ లోనే సాలిడ్ టిఆర్పిని సొంతం చేసుకున్న 'హనుమాన్'

by సూర్య | Thu, May 09, 2024, 02:54 PM

పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తొలి టెలికాస్ట్‌లో 10.26 టిఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం.

అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM