'కమిటీ కుర్రోళ్లు' ఫస్ట్ సింగల్ అవుట్

by సూర్య | Wed, May 08, 2024, 06:28 PM

నిహారిక కొణిదెల తన యాక్టింగ్ కెరీర్‌తో పాటు వెబ్ సిరీస్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నిహారిక వెండితెరకు కొత్త ముఖాలను పరిచయం చేస్తూ తన తొలి చలన చిత్రాన్ని ప్రారంభించనుంది.


ఈ సినిమాకి 'కమిటీ కుర్రోళ్లు' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని గొర్రెల అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి కీలక పాత్రలో నటిస్తున్నారు.


శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంతో యధు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM