స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' తమిళ వెర్షన్

by సూర్య | Wed, May 08, 2024, 05:35 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'ఊరి పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫాంటసీ రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు తమిళంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది అని సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, రవిశంకర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM