65M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గుంటూరు కారం'

by సూర్య | Wed, May 08, 2024, 04:45 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రం యొక్క డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో 65 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మీనాక్షి చౌదరి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, మరియు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM