బాలకృష్ణ సినిమా లో కాజల్‌ ?

by సూర్య | Wed, May 08, 2024, 11:42 AM

హీరోహీరోయిన్లు ఒకసారి కలిసి నటిస్తే, మళ్లీ కలిసి చేయడానికి కాస్త సమయం తీసుకుంటారు. వెంటనే మరో సినిమా చేసేయడం నేటిరోజుల్లో అరుదైన విషయం. చిరంజీవి, బాలకృష్ణ హయాంలో విజయశాంతి, రాధ వరుసపెట్టి సినిమాలు చేసేవారు. ఇప్పుడైతే ఆ ట్రెండ్‌ లేదు. అయితే.. బాలకృష్ణ, కాజల్‌ ఆ ట్రెండ్‌ని రిపీట్‌ చేయనున్నారని ఫిల్మ్‌వర్గాల టాక్‌. ‘భగవంత్‌ కేసరి’తో భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట, రానున్న కేఎస్‌ రవీంద్ర(బాబి) సినిమాలో కూడా కలిసి నటిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.ఇందులో ఊర్వశీ రౌతేలా నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించినా.. ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదని, ఆమె పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నదని ఫిల్మ్‌వర్గాలు చెబుతున్నాయి. అందుకని కాజల్‌ ఇందులో హీరోయిన్‌ అనుకుంటే మళ్లీ పప్పులో కాలేసినట్టే.. ఇందులో కాజల్‌ నెగిటీవ్‌ షేడ్స్‌ ఉండే పాత్ర చేస్తున్నదట. మరి బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్‌ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 


 

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM