దర్శకుడు కరుణ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'మట్కా' టీమ్

by సూర్య | Mon, May 06, 2024, 08:38 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'మట్కా' అని టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ హై-బడ్జెట్ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రలో కనిపించనుంది. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM