డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది'

by సూర్య | Mon, May 06, 2024, 02:43 PM

శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' సినిమా ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా OTT ప్లాట్ఫారం ఈ సినిమా మే 8, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది.

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అంజలి 50వ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడు. కోన ఫిలింస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోన వెంకట్, ఎంవివి సినిమాస్ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM