యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌

by సూర్య | Tue, Apr 30, 2024, 04:24 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క టీజర్‌ను విడుదల చేయగా యూట్యూబ్ లో ఇప్పుడు ఈ సినిమా టీజర్ టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు అధికారకంగా ప్రకటించారు.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 17, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM