PCX ఫార్మాట్ లో విడుదల కానున్న 'కల్కి 2898 AD'

by సూర్య | Tue, Apr 30, 2024, 03:26 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం PCX ఫార్మాట్ లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కొణిదెల శ్రీజ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 01:33 PM
ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం : కాజల్ Tue, May 21, 2024, 11:34 AM
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్? Tue, May 21, 2024, 10:56 AM
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM