'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్

by సూర్య | Thu, Apr 25, 2024, 02:25 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019 లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. పుష్ప 2 యొక్క పవర్-ప్యాక్డ్ టీజర్‌ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ప్రోమోని పుష్ప పుష్ప అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'విరూపాక్ష' Sat, May 18, 2024, 02:58 PM
'దేవర' ఫస్ట్ సింగల్ రిలీజ్ కి టైమ్ లాక్ Sat, May 18, 2024, 02:57 PM
'ప్రసన్నవదనం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, May 18, 2024, 02:54 PM
జెమినీ టీవీలో రేపటి స్పెషల్ మూవీస్ Sat, May 18, 2024, 02:52 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Sat, May 18, 2024, 02:51 PM