'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీపై లేటెస్ట్ బజ్

by సూర్య | Wed, Apr 24, 2024, 04:04 PM

చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మెల్ బాయ్స్ మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ యొక్క తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6, 2024న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.


ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'సుందరం మాస్టర్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, May 06, 2024, 03:35 PM
'మ్యూజిక్ షాప్ మూర్తి' నుండి అంతరంతమూర్తి లిరికల్ వీడియో అవుట్ Mon, May 06, 2024, 03:20 PM
కృష్ణమ్మ : కృష్ణమ్మ కథలు విత్ కొరటాల శివ వీడియో రిలీజ్ Mon, May 06, 2024, 03:18 PM
'ఆ ఒక్కటి అడక్కు' 2 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, May 06, 2024, 03:15 PM
'భలే ఉన్నాడే' టీజర్ అవుట్ Mon, May 06, 2024, 03:08 PM