OTT ఎంట్రీ ఇచ్చేసిన 'మిషన్ చాప్టర్ 1' హిందీ వెర్షన్

by సూర్య | Tue, Apr 23, 2024, 04:44 PM

AL విజయ్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన మిషన్ చాప్టర్ 1 సినిమా జనవరి 12, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ లో అరుణ్ విజయ్ సరసన అమీ జాక్సన్ జోడిగా నటిస్తుంది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతిభావంతులైన మలయాళ నటి నిమిషా సజయన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిషన్: చాప్టర్ 1ని ఎం రాజశేఖర్ మరియు ఎస్ స్వాతి సంయుక్తంగా నిర్మించారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM