by సూర్య | Mon, Apr 22, 2024, 09:10 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కూలీ'. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేసారు చిత్రబృందం.రజనీకాంత్ 171వ సినిమాగా ఇది రూపొందుతోంది.ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గోల్డ్ మాఫియా చుట్టు తిరిగే కధ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ యాక్షన్ కట్ తో రెడీ అయిన ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని సన్ పిక్టర్లు బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Latest News