'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sat, Apr 20, 2024, 06:32 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఫస్ట్ లుక్ లాంచ్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

ఫస్ట్ లుక్ రివీల్ సందర్భంగా, ప్రతి నెలా కనీసం ఒక అప్‌డేట్ ఉంటుందని మూవీ మేకర్స్ హామీ ఇచ్చారు. అది జరగకపోవడంతో, ప్రభాస్ అభిమానులు అప్‌డేట్స్ కోసం ప్రొడక్షన్ హౌస్‌ని అభ్యర్థిస్తున్నారు. అయితే  ప్రభాస్ యొక్క సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD విడుదలయ్యే వరకు రాజా సబ్ నుండి మూవీ మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ని ఇవ్వనున్నట్లు లేటెస్ట్ టాక్.

క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఇవాళ దాసరి నారాయణరావు జయంతి Sat, May 04, 2024, 10:16 AM
అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక Sat, May 04, 2024, 10:10 AM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM