'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్

by సూర్య | Sat, Apr 20, 2024, 05:12 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో డిజిటల్ ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా 'జితేందర్ రెడ్డి' ట్రైలర్ Fri, May 03, 2024, 04:34 PM
నేడు OTT ఎంట్రీ ఇవ్వనున్న 'షైతాన్' Fri, May 03, 2024, 04:32 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బ్రో' Fri, May 03, 2024, 04:22 PM
OTTలో 'హీరామండి' స్మాష్ హిట్ Fri, May 03, 2024, 04:20 PM
దేవకీ నందన వాసుదేవలోని 'ఏమయ్యిందే' సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 04:17 PM