ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ని డీయాక్టివేట్ చేసిన యువన్ శంకర్ రాజా

by సూర్య | Thu, Apr 18, 2024, 06:14 PM

కోలీవుడ్‌లోని అత్యుత్తమ సంగీత దర్శకులలో ఒకరైన యువన్ శంకర్ రాజా ప్రస్తుతం విజయ్ నటించిన మరియు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌' కి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ విజిల్ పోడు అనే టైటిల్ తో విడుదల అవ్వగా, ప్రేక్షకులలో ఈ సాంగ్ కి ఆదరణ మిశ్రమంగా వచ్చింది.


తాజాగా యువన్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ని డీయాక్టివేట్ చేసారు. విజయ్ అభిమానుల నుండి వచ్చిన విమర్శలు ఈ చర్యను ప్రేరేపించి ఉండవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో లేనప్పటికీ, యువన్ X లో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే అతను ఇన్‌స్టాగ్రామ్ నుండి నిష్క్రమించడానికి గల కారణాన్ని అతను వెల్లడించలేదు. వర్క్ ఫ్రంట్ లో చూస్తే, స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ జూ కీపర్, మారిసన్ కి సంగీతం అందించనున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM