'రాజా సాబ్' పై లేటెస్ట్ బజ్

by సూర్య | Thu, Apr 18, 2024, 05:51 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. మూవీ మేకర్స్ ఒక పాటను ప్రభాస్ మరియు నిధి అగర్వాల్‌పై చిత్రీకరిస్తున్నారు.


అయితే, ప్రభాస్ యొక్క ఒక వీడియో ఇంటర్నెట్‌లో లీక్ చేయబడింది. ఈ సినిమాలో ప్రభాస్ పొడవాటి జుట్టులో కనిపించనున్నట్లు సమాచారం. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది.


అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM