1M +వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టేనంట్' రిలీజ్ ట్రైలర్

by సూర్య | Wed, Apr 17, 2024, 07:06 PM

యుగంధర్ దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యం రాజేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టేనంట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేయగా, యూట్యూబ్ లో రిలీజ్ ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి వైఎస్ శ్రీనివాస్ శర్మ కథను అందించగా సాహితీ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి యుగేందర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు. మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తేర్ నొరోన్హా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM