శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' బృందం

by సూర్య | Wed, Apr 17, 2024, 03:42 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. అంతేకాకుండా పోస్టర్ లో ఈ సినిమా టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 17, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ Tue, Apr 30, 2024, 10:37 AM
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM