త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'ఫ్యామిలీ స్టార్'

by సూర్య | Mon, Apr 15, 2024, 02:33 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM