'షైతాన్' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...!

by సూర్య | Sat, Apr 13, 2024, 11:29 AM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు సౌత్ స్టార్స్ జ్యోతిక మరియు మాధవన్ నటించిన 'షైతాన్' మార్చి 8, 2024న విడుదల అయ్యింది. హారర్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. త్వరలో డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనుంది. షైతాన్ సినిమా సూపర్ హిట్ గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ యొక్క అధికారిక రీమేక్.

ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలట్‌గా నటించగా, అజయ్ భార్యగా జ్యోతిక కనిపించనుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్ Mon, Oct 21, 2024, 02:44 PM
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM