'వేట్టైయాన్‌' లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించిన ఫహద్ ఫాసిల్

by సూర్య | Fri, Apr 12, 2024, 08:32 PM

జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టైయన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 2024లో పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఫహద్ ఫాసిల్ తన పాత్ర గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించాడు. వేట్టైయన్‌లో తాను హాస్యభరితమైన పాత్రను పోషిస్తున్నానని, ఇది ప్రస్తుతం తాను చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఉంటుందని ఫహద్ పేర్కొన్నాడు. ఫహద్‌ని సీరియస్‌గా లేని పాత్రలో చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది.


వేట్టైయన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM