'ఏజెంట్' OTT విడుదలపై నిర్మాత ఆసక్తికరమైన ప్రకటన

by సూర్య | Fri, Apr 12, 2024, 08:06 PM

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ లివ్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ విడుదల చాలాసార్లు వాయిదా పడింది ఇటీవల ఒక అభిమాని చిత్ర నిర్మాత అనిల్ సుంకరను డిజిటల్ ఎంట్రీ గురించి అడగగా.... నేను ఇప్పటికే రెండు సార్లు తెలియజేశాను. మేము డిజిటల్‌ రైట్స్ ని B4Uకి మరియు వాటిని సోనీకి విక్రయించాము. వారు త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నాము అని అన్నారు.
 
ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM