యూట్యూబ్ ట్రేండింగ్ లో 'లక్కీ బాస్కర్' టీజర్

by సూర్య | Fri, Apr 12, 2024, 07:32 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ యొక్క మూడవ స్ట్రెయిట్ తెలుగు సినిమా అయ్యిన ఈ సినిమా పై సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ చిత్రానికి 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత Fri, Oct 25, 2024, 10:51 AM
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM