భారీ మొత్తానికి అమ్ముడయిన 'పుష్ప 2' ఆడియో రైట్స్

by సూర్య | Fri, Apr 12, 2024, 03:23 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ పుట్టినరోజున టీజర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు తదుపరి స్థాయికి వెళ్ళాయి.


ఈ సినిమా యొక్క అన్ని భాషల ఆడియో హక్కులను టి-సిరీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. భూషణ్ కుమార్థ అన్ని భాషల సంగీత హక్కుల కోసం దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు లాటెట్స్ టాక్. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.


ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM