ఓటిటిలో 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' కి భారీ స్పందన

by సూర్య | Fri, Apr 12, 2024, 03:18 PM

తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో అభినవ్ గోమతం నటించిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మార్చి 29న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రేండింగ్ లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించింది.


ఈ సినిమాలో అభినవ్ గోమతం సరసన వైశాలి రాజ్ జంటగా నటించింది. ఈ చిత్రాన్ని కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై భవానీ కాసుల, ఆరెంరెడ్డి, ప్రశాంత్‌ వి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ రెజా, మోయిన్, నిజల్గల్ రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శామ్యూల్ అబీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM