సత్యం రాజేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'టేనంట్' టీమ్

by సూర్య | Fri, Apr 12, 2024, 02:55 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యం రాజేష్. అతను తన కెరీర్‌లో అనేక రకాల పాత్రలను పోషించాడు. తాజాగా ఇప్పుడు నటుడు 'టేనంట్' అనే చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యం రాజేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.

టెనెంట్ సినిమా కుటుంబ ప్రేక్షకులను రంజింపజేయడానికి రూపొందించబడిన ఒక సాధారణ, భావోద్వేగ హత్య మిస్టరీ చిత్రం. ఈ చిత్రానికి వైఎస్ శ్రీనివాస్ శర్మ కథను అందించగా సాహితీ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు.


ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తేర్ నొరోన్హా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM