by సూర్య | Thu, Apr 11, 2024, 03:36 PM
MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఏప్రిల్ 11, 2024న సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సముద్రఖని, బ్రహ్మాజీ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.