‘సి 202’ ట్రైలర్‌ విడుదల

by సూర్య | Fri, Feb 23, 2024, 06:47 PM

మైటీ ఒక్ పిక్చర్స్  పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘సి 202’. మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి మనోహరి కె ఎ నిర్మాత. పూర్తి సినిమా రాత్రిపూట చిత్రీకరించబడిన ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విశేషం ఏమిటంటే.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ.. కేవలం సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఉండటం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు, హీరో అయిన మున్నా కాశి మాట్లాడుతూ.. ‘సి 202’  ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కించాం. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే అందరికీ అది అర్థమవుతుంది. ఒక డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్‌లను చూపిస్తూ సౌండ్ ఎఫెక్ట్స్‌తో.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాపై ఇంట్రస్ట్ కలిగించేలా ట్రైలర్‌ని కట్ చేశాం. ఈ ట్రైలర్‌ని ‘సౌండ్ ఆఫ్ సి 202’  అని పిలుచుకుంటున్నాము. ఈ ట్రైలర్‌ని మంచి సౌండ్ సిస్టమ్‌తో చూడండి, ఖచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది.

Latest News
 
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో సూర్య Sat, Oct 19, 2024, 07:27 PM
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన కోలీవుడ్ హీరో Sat, Oct 19, 2024, 07:23 PM
'ధూమ్ ధామ్' అప్డేట్ ని రివీల్ చేయనున్న ప్రముఖ దర్శకుడు Sat, Oct 19, 2024, 07:15 PM